ISS: రాత్రివేళ మెరిసిపోతూ కనిపించిన భారత్... ఫొటోలు విడుదల చేసిన ఐఎస్ఎస్

India Glows at Night ISS Releases Breathtaking Photos

 


అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి రాత్రి వేళ తీసిన కొన్ని అద్భుతమైన చిత్రాలు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. . వీటిలో, నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద కాంతివంతంగా వెలిగిపోతున్న భారతదేశం ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఫొటోలకు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభిస్తోంది.

ఐఎస్ఎస్ విడుదల చేసిన ఈ చిత్రాలలో మధ్య పశ్చిమ అమెరికాలోని మేఘావృతమైన ప్రాంతం, ఆగ్నేయాసియా తీర, లోతట్టు ప్రాంతాలు, ఆకుపచ్చని కాంతులతో ఆవరించి ఉన్న కెనడాను కూడా చూడొచ్చు. భూమి వక్రత కారణంగా, ఈ ఫొటోల్లో ఆకాశం వంపు తిరిగినట్టుగా మరింత అందంగా కనిపిస్తోంది.

'నక్షత్రాలు, నగర కాంతులు, మరియు భూమి యొక్క వాతావరణ కాంతిని ఒకేసారి చూడగలిగినప్పుడు' అనే శీర్షికతో ఈ చిత్రాలను ఐఎస్ఎస్ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. ఈ చిత్రాలు కాసేపట్లోనే వైరల్ అయ్యాయి.

ఐఎస్ఎస్ భూమి నుంచి 370-460 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ నిరంతరం ఇలాంటి చిత్రాలను పంచుకుంటుంది. ఇదివరకూ మహా కుంభమేళా చిత్రాన్ని కూడా ఐఎస్ఎస్ నుంచి నాసా వ్యోమగామి డొనాల్డ్ పెట్టిట్ పంచుకున్నారు.

ISS
International Space Station
India at Night
Nighttime Images of India
Earth from Space
ISS Photos
NASA Astronaut Donald Pettit
Social Media Viral
Stunning Earth Images
Space Photography
  • Loading...

More Telugu News