తిరుమల వెంకన్నను దర్శించుకున్న హీరోయిన్ మీనాక్షి చౌదరి
- ఇటీవల హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న మీనాక్షి చౌదరి
- నేడు వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారి దర్శనం
- స్వాగతం పలికిన అధికారులు
కాగా, మీనాక్షి చౌదరి నేడు తిరుమలలో సందడి చేశారు. ఇవాళ వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆమెకు అధికారులు ఆలయంలోకి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆలయం వెలుపల మీనాక్షి చౌదరిని చూసేందుకు జనాలు ఆసక్తి చూపించారు. తనను విష్ చేసిన వారికి తిరిగి అభివాదం చేస్తూ ఆమె ముందుకు సాగారు.