World's Tallest Bridge: ప్ర‌పంచంలోనే ఎత్తైన బ్రిడ్జి... గతంలో గంట సమయం పట్టే ప్రయాణం ఇప్పుడు ఒక్క నిమిషంలోనే... ఎక్క‌డో తెలుసా?

China Unveils Huajiang Grand Canyon Bridge

  • మ‌రో ఇంజినీరింగ్ అద్భుతాన్ని ఆవిష్క‌రించ‌నున్న చైనా
  • ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి
  • గుయ్ ఝౌలోని దీప‌న్ న‌దిపై 2050 అడుగుల ఎత్తులో వంతెన నిర్మాణం
  • రూ. 2,200 కోట్ల వ్య‌యంతో బ్రిడ్జి నిర్మాణం.. జూన్‌లో ప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌క‌టన‌

డ్రాగ‌న్ కంట్రీ చైనా మ‌రో ఇంజినీరింగ్ అద్భుతాన్ని ఆవిష్క‌రించ‌నుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జిని జూన్‌లో ప్రారంభించ‌నుంది. గుయ్ ఝౌలోని దీప‌న్ న‌దిపై 2,050 అడుగుల ఎత్తులో ఈ వంతెన‌ను నిర్మించింది. 

ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావ‌డానికి మూడేళ్లు ప‌ట్టింది. అలాగే వంతెన నిర్మాణానికి ఏకంగా 216 మిలియ‌న్ పౌండ్స్ (రూ. 2,200 కోట్లు) ఖ‌ర్చు అయ్యాయి. ఇది ఈఫిల్ ట‌వ‌ర్ కంటే 200 మీట‌ర్లు ఎత్తుగా ఉంటుంది. గతంలో గంట సమయం పట్టే ప్ర‌యాణం ఈ భారీ బ్రిడ్జి నిర్మాణం వ‌ల్ల ఒక్క నిమిషంలోనే పూర్త‌వుతుంద‌ట‌. 

ఇక, ఈ సూపర్ ప్రాజెక్ట్ చైనా ఇంజనీరింగ్ సామర్థ్యాలను ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌డంతో పాటు ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా మారాలనే గుయ్ ఝౌ లక్ష్యానికి మరింత ఊతమిస్తుందని చైనా రాజకీయనేత‌ జాంగ్ షెంగ్లిన్ అన్నారు. 

ప్ర‌స్తుతం ఈ అద్భుత‌మైన క‌ట్ట‌డం తాలూకు వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. 

World's Tallest Bridge
Huajiang Grand Canyon Bridge
China
Guizhou
Engineering Marvel
Deepan River
Zhang Shenglin
Tourism Destination
Tallest Bridge
Bridge Construction
  • Loading...

More Telugu News