Devineni Uma: దేవినేని ఉమా కుమారుడి నిశ్చితార్థానికి హాజరైన సీఎం చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!

టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా కుమారుడు నిహార్, నర్మద నిశ్చితార్ధ వేడుక ఇవాళ విజయవాడలో ఘనంగా జరిగింది. నగరంలోని ఏ-కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ శుభకార్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. కాబోయే దంపతులకు ఆయన పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ నిశ్చితార్ధ వేడుకకు టీడీపీ నేతలు భారీగా తరలివచ్చారు.





