Gangareddy: జగిత్యాలలో భారీ అగ్ని ప్రమాదం

- మెట్‌పల్లి మండలం కొండ్రికర్లలోని రైస్ మిల్లులో ప్రమాదం
- మహాలక్ష్మి ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో ప్రమాదవశాత్తు మంటలు
- రూ.2 కోట్ల విలువైన ఆస్తి దగ్ధం
జగిత్యాల జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 2 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. మెట్‌పల్లి మండలం కొండ్రికర్ల గ్రామ శివారులోని మహాలక్ష్మి ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో శనివారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో సుమారు 5 వేల క్వింటాళ్ల వరి ధాన్యం, 85 వేల గోనె సంచులు కాలి బూడిదైనట్లు మిల్లు యజమాని గంగారెడ్డి తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా దాదాపు రూ. 2 కోట్ల విలువైన ఆస్తి నష్టపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.