మ‌రోసారి నిలిచిపోయిన యూపీఐ సేవ‌లు

  • ప‌నిచేయ‌ని ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌లు
  • యూపీఐ చెల్లింపులు జ‌ర‌గ‌డం లేదంటూ యూజ‌ర్ల గగ్గోలు 
  • ఇటీవ‌ల యూపీఐ పేమెంట్స్ లో త‌ర‌చూ ఆటంకం ఏర్ప‌డుతున్న వైనం
యూపీఐ పేమెంట్స్ లో మ‌రోసారి అంత‌రాయం ఏర్పడింది. దేశ వ్యాప్తంగా ఈ సేవ‌లు నిలిచిపోయాయి. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌లు ప‌నిచేయ‌డం లేదు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ కొంద‌రు వినియోగ‌దారులు సోష‌ల్ మీడియా వేదిక‌గా అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. యూపీఐ చెల్లింపులు జ‌ర‌గ‌డం లేద‌ని, నెట్‌వ‌ర్క్ స్లో అని వ‌స్తుందంటూ ప‌లువురు పోస్టులు పెడుతున్నారు. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యానికి దాదాపు 1,000 మందికి పైగా యూపీఐ సేవ‌ల్లో అంత‌రాయం గురించి ఫిర్యాదు చేసిన‌ట్లు డౌన్ డిటెక్ట‌ర్ వెబ్‌సైట్ తెలిపింది. 

ఇక ఇటీవ‌ల యూపీఐ పేమెంట్స్ లో త‌ర‌చూ ఆటంకం ఏర్ప‌డుతున్న విష‌యం తెలిసిందే. గ‌త నెల 26వ తేదీన ఇలాంటి పరిస్థితి త‌లెత్త‌గా... సాంకేతిక కార‌ణంతో ఇలా జ‌రిగింద‌ని ఎన్‌పీసీఐ అప్ప‌ట్లో వివ‌ర‌ణ ఇచ్చింది. ఆ త‌ర్వాత ఈ నెల 2న కూడా యూపీఐ సేవ‌లకు కొంత‌సేపు అంత‌రాయం క‌లిగింది. రోజుల వ్య‌వ‌ధిలో తాజాగా మ‌రోసారి యూపీఐ చెల్లింపుల వ్య‌వ‌స్థ‌లో ఆటంకం ఏర్ప‌డింది. దీనిపై ఎన్‌పీసీఐ ఇంకా స్పందించ‌లేదు.     



More Telugu News