ఢిల్లీ స్టేడియంలో షాకింగ్ ఘ‌ట‌న‌... ప‌రుగందుకున్న ప్లేయ‌ర్లు.. రోహిత్ వీడియో వైర‌ల్‌!

   
ఆదివారం నాడు ఢిల్లీలో ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ), ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇప్ప‌టికే ఢిల్లీ చేరుకున్న ఎంఐ ఆట‌గాళ్లు నిన్న‌ ముమ్మ‌రంగా ప్రాక్టీస్ చేశారు. ఈ క్ర‌మంలో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఒక్కసారిగా వాతావ‌ర‌ణం మారిపోవ‌డంతో పాటు మైదానాన్ని దుమ్ము క‌మ్మేసింది. చూస్తుండ‌గానే స్టేడియంలోకి విప‌రీతంగా దుమ్ము వ‌చ్చేసింది. 

దాంతో ముంబ‌యి స్టార్ ప్లేయ‌ర్ రోహిత్ శ‌ర్మ ఆ స‌మ‌యంలో ప్రాక్టీస్ చేస్తున్న‌ త‌న స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల‌ను వెంట‌నే వెన‌క్కి వ‌చ్చేయాలంటూ గ‌ట్టిగా కేక‌లు వేశాడు. అలా హిట్‌మ్యాన్ తోటి ప్లేయ‌ర్ల‌ను పిలుస్తూ అరిచిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక రోహిత్ పిలుపుతో ఎంఐ కోచ్ జయవర్ధనే, ల‌సిత్ మ‌లింగ‌తో పాటు బౌల్ట్‌, దీప‌క్ చాహ‌ర్ ప‌రుగు అందుకున్నారు.

ఇక ఈసారి సీజ‌న్‌లో ఢిల్లీ జ‌ట్టు ఓట‌మి అనేదే లేకుండా దూసుకెళ్తుంటే... మ‌రోవైపు ముంబ‌యి వ‌రుస ఓట‌ముల‌తో డీలాప‌డిపోయింది. ఢిల్లీ ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజ‌యం సాధించ‌గా... ముంబ‌యి మాత్రం ఐదు మ్యాచ్‌లు ఆడి, కేవ‌లం ఒక్క విజ‌యంతో స‌రిపెట్టుకుంది. దీంతో రేప‌టి మ్యాచ్ ఎంఐకి చాలా కీల‌కం. వ‌రుస ప‌రాజ‌యాల‌కు చెక్ పెట్టాలంటే ఈ మ్యాచ్‌లో ముంబ‌యి గెల‌వాల్సిందే.  


More Telugu News