రూ. 10 వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారు: కేటీఆర్
- రేవంత్ ప్రభుత్వం ఆర్థిక నేరానికి పాల్పడుతోందన్న కేటీఆర్
- రేవంత్ కు ఒక బీజేపీ ఎంపీ సహకరిస్తున్నారని ఆరోపణ
- ఒక బ్రోకరేజ్ కంపెనీతో సంప్రదింపులు కూడా జరిపారన్న కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీకి చెందిన ఒక ఎంపీ పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఒక బ్రోకరేజ్ కంపెనీతో సంప్రదింపులు కూడా జరిపారని తెలిపారు. ఎఫ్ఆర్బీఎంను బైపాస్ చేసి డబ్బులు ఇస్తామని... ఆ తర్వాత భూములు అమ్ముకోవచ్చని ఆ బ్రోకరేజ్ కంపెనీ తెలిపిందని అన్నారు. దీనికోసం సుప్రీంకోర్టు తీర్పులు, చట్టాలు, ఆర్బీఐ నిబంధనలను తుంగలో తొక్కారని విమర్శించారు.