Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తగ్గేదేలే అంటున్న వర్మ... మరో సినిమా ప్రకటన

Ram Gopal Varma Announces New Horror Film Police Station Mein Booth
Advertisement
  • మరో హారర్ సినిమాను ప్రకటించిన వర్మ
  • 'పోలీస్ స్టేషన్ మే బూత్' సినిమాను తెరకెక్కించనున్న వర్మ
  • ప్రధాన పాత్రను పోషిస్తున్న మనోజ్ బాజ్ పేయి
Advertisement
టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం 'శారీ' బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమాలో హీరోయిన్ అందాలను ఆరబోసినప్పటికీ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. వరుసగా ఫ్లాపులు వస్తున్నప్పటికీ వర్మ ఏమాత్రం తగ్గడం లేదు. మరో సినిమాను ప్రకటించారు. 'పోలీస్ స్టేషన్ మే బూత్' అనే హారర్ చిత్రాన్ని ప్రకటించారు. 'మీరు చనిపోయిన వారిని చంపలేరు' అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్.

ఈ సినిమాలో మనోజ్ బాజ్ పేయి ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా గురించి వర్మ మాట్లాడుతూ... మనం భయపడినప్పుడు పోలీసుల దగ్గరకు వెళతామని... పోలీసులు భయపడినప్పుడు ఎక్కడకు పరుగెత్తుతారు? అనే పాయింట్ మీద కథ తిరుగుతుందని చెప్పారు. ఒక భారీ ఎన్ కౌంటర్ తర్వాత ఓ పోలీస్ స్టేషన్ దెయ్యాల స్టేషన్ గా మారుతుందని... గ్యాంగ్ స్టర్ దెయ్యాల నుంచి తప్పించుకోవడానికి పోలీసులందరూ భయంతో పరుగెత్తుతూ ఉంటారని తెలిపారు. ఈ సినిమాపై వర్మ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు ఆయన మాటలను బట్టి తెలుస్తోంది.
Advertisement
Advertisement
Ram Gopal Varma
RGV
Police Station Mein Booth
Manoj Bajpayee
Horror Film
Telugu Cinema
Tollywood
New Movie Announcement
Bollywood
Indian Horror

More Telugu News