Raghunandan Rao: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. కేటీఆర్, హరీశ్ రావు‌పై రఘునందన్ రావు తీవ్ర విమర్శలు

Raghunandan Rao Slams KTR Harish Rao over Gachibowli Land Issue
  • బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూములను అడ్డగోలుగా అమ్మేశారని ఆరోపణ
  • దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉందని విమర్శ
  • బీఆర్ఎస్ హయాంలో రికార్డుల్లోకి ఎందుకు ఎక్కించలేదని నిలదీత
హైదరాబాద్ నగరంలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బీజేపీ నేత, మెదక్ లోక్‌సభ సభ్యుడు రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 400 ఎకరాల భూముల అంశంలో దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉందని కేటీఆర్, హరీశ్ రావును ఉద్దేశించి అన్నారు. బీఆర్ఎస్ నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూములను అడ్డగోలుగా అమ్మేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్న కేటీఆర్, హరీశ్ రావు ఎక్కడకు పోయారని నిలదీశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) భూములపై ఎందుకు సమీక్ష చేయలేదో చెప్పాలని అన్నారు. హెచ్‌సీయూ రికార్డులలోకి ఎందుకు ఎక్కించలేదని నిలదీశారు.

ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. విశ్వవిద్యాలయ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. హెచ్‌సీయూ భూములను కాపాడాలని తాము కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిశామని, ఇంచు భూమి పోకుండా విద్యార్థుల తరఫున పోరాడుతామని హామీ ఇచ్చారు.
Raghunandan Rao
KTR
Harish Rao
Gachibowli land scam
BJP
BRS
Hyderabad
HCU land
Telangana Politics
Land grabbing

More Telugu News