Kollu Ravindra: ఏపీ సరిహద్దుల్లో మద్యం అమ్మకాలు పెరిగాయి: కొల్లు రవీంద్ర

- మద్యం అమ్మకాలపై 13 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామన్న కొల్లు రవీంద్ర
- వైసీపీ హయాంలో అక్రమ కేసులు పెడుతూ రెచ్చిపోయారని మండిపాటు
- తాను కూడా 44 రోజుల పాటు జైల్లో ఉన్నానని వ్యాఖ్య
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో దాదాపు రూ. లక్ష కోట్ల లావాదేవీలు జరిగాయని చెప్పారు. దీనిపై సీఐడీ విచారణ జరుగుతోందని తెలిపారు. మద్యం నాణ్యతపై 13 రకాల పరీక్షలను 5 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏపీ సరిహద్దుల్లో మద్యం అమ్మకాలు పెరిగాయని, దీనివల్ల రాష్ట్రానికి మరింత ఆదాయం వస్తోందని తెలిపారు. బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు.
వైసీపీ హయాంలో అక్రమ కేసులు పెడుతూ రెచ్చిపోయారని... తాను కూడా 44 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నానని కొల్లు రవీంద్ర తెలిపారు. టీడీపీని ఇబ్బంది పెట్టిన పోలీసులకు ప్రమోషన్లు ఇచ్చారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వస్తే కూటమి నేతల తలలు తీస్తామని ఒక మాజీ మంత్రి అన్నారని... అలాంటి వాళ్లపై కచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టాలని అన్నారు.