YS Jagan: పోలీసులపై జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు..!

- పోలీసులను ప్రభుత్వం వాచ్‌మెన్ల కంటే ఘోరంగా వాడుకుంటోందన్న జగన్
- ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నేతలతో జగన్ భేటీ
- ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత ఇటీవల పోలీసులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మళ్లీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల బట్టలూడదీస్తామని అన్నారు. ఇప్పుడు మరోసారి జగన్ పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులను కూటమి ప్రభుత్వం వాచ్‌మెన్ల కంటే ఘోరంగా వాడుకుంటోందని ఆరోపించారు.
ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నేతలు, కార్యకర్తలతో జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి అన్ని వర్గాల వారిని మోసం చేశారని దుయ్యబట్టారు. హామీల అమలు, పాలనలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం ఇప్పటికే రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టినా హామీల అమలు జరగలేదని మండిపడ్డారు. టీడీపీ నేతలు ప్రజల వద్దకు వెళ్లే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన కొనసాగుతోందని జగన్ ఫైర్ అయ్యారు.