Ambati Rayudu: నేనెప్పటికీ తలా అభిమానినే.. ఎవరేమనుకున్నా.. ఏం చేసినా పర్లేదు: అంబటి రాయుడు

ఐపీఎల్ 18వ సీజన్‌లో టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు కామెంటెటర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక రాయుడు ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ (ఎంఐ)తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కు ప్రాతినిధ్యం వహించారు.
అయితే, సీఎస్‌కే, ఎంఎస్ ధోనీకి మద్దతుగా మాట్లాడుతున్నాడంటూ తనపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ట్రోల్స్‌కు తాజాగా రాయుడు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చాడు. తానెప్పటికీ తలా ఫ్యానే... ఎవరేమనుకున్నా... ఏం చేసినా పర్లేదంటూ ట్వీట్ చేశాడు.
"నేనెప్పటికీ తలా అభిమానినే.. ఎవరేమనుకున్నా.. ఏం చేసినా ఫర్వాలేదు. ఇందులో ఏమాత్రం తేడా ఉండదు. కాబట్టి పెయిడ్ పీఆర్ కోసం డబ్బులు ఖర్చు చేయడం ఆపేయండి. ఆ డబ్బుల్ని పేదలకు విరాళంగా ఇవ్వండి" అని రాయుడు తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు.