Hyderabad Police: హైదరాబాద్ లో ఎల్లుండి వైన్ షాపులు, బార్లు బంద్

- ఈ నెల 12న హనుమాన్ జయంతి
- మద్యం దుకాణాలను మూసివేయాలంటూ పోలీసుల ఆదేశాలు
- 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు బంద్
హైదరాబాద్ లోని మందుబాబులకు బ్యాడ్ న్యూస్. ఎల్లుండి (12వ తేదీ, శనివారం) వైన్ షాపులు, బార్లు మూతపడనున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలను మూసి వేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల ఆదేశాల ప్రకారం 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.
వైన్ షాపులు, బార్లతో పాటు కల్లు కాంపౌండ్ లను కూడా మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల జరిగిన శ్రీరామ నవమి సందర్భంగా కూడా మద్యం దుకాణాలు మూతపడ్డాయి.