Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో కాపర్ రీసైక్లింగ్ యూనిట్‌లో అగ్ని ప్రమాదం

- రూ. 1 కోటికి పైగా విలువ చేసే కాపర్ తుక్కు అగ్నికి ఆహుతి
- మంటలు రావడం గమనించి అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించిన స్థానికులు
- అధికారులు వెంటనే స్పందించడంతో తప్పిన ప్రమాదం
హైదరాబాద్ నగరంలోని ప్రశాంతినగర్‌లో ఓ కాపర్ రీసైక్లింగ్ యూనిట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో సుమారు రూ. 1 కోటి విలువైన కాపర్ తుక్కు పూర్తిగా దగ్ధమైంది. కాపర్ రీసైక్లింగ్ యూనిట్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లు, పది వాటర్ ట్యాంకర్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. అధికారులు తక్షణమే స్పందించడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొంటున్నారు.
ఈ ప్రమాదం కారణంగా పక్కనే ఉన్న డాకస్ సీ కంపెనీలో దాదాపు కోటి రూపాయల విలువైన ముడి సరుకు, యంత్ర పరికరాలు దెబ్బతిన్నాయని ఆ కంపెనీ యాజమాన్యం వెల్లడించింది.