Malla Reddy: జపాన్ లో బుల్లెట్ రైలు ఎక్కిన మాజీ మంత్రి మల్లారెడ్డి

- కుటుంబ సభ్యులతో కలిసి జపాన్ కు వెళ్లిన మల్లారెడ్డి
- జపాన్ అందాలను ఆస్వాదిస్తున్న మాజీ మంత్రి
- స్థానిక ప్రజలతో ఫొటోలు దిగుతూ సందడి
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన జపాన్ కు వెళ్లారు. అక్కడి అందాలను ఆస్వాదిస్తూ కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నారు. జపాన్ లోని వివిధ సిటీల్లో పర్యటిస్తున్నారు. తాజాగా బుల్లెట్ ట్రైన్ ఎక్కారు. ట్రైన్ ఎక్కడానికి ముందు బుల్లెట్ రైలు ఎదుట ఆయన దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్థానిక ప్రజలతో కూడా ఫొటోలు దిగుతూ మల్లారెడ్డి సందడి చేస్తున్నారు.