Thopudurti Prakash Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తిపై కేసు నమోదు

- తోపుదుర్తిపై కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఫిర్యాదు
- రామగిరి పీఎస్ లో తోపుదుర్తిపై కేసు నమోదు
- తోపుదుర్తి రెచ్చగొట్టడంతోనే వైసీపీ కార్యకర్తలు హెలీప్యాడ్ వద్దకు వెళ్లారన్న పోలీసులు
రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై రామగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. జగన్ పర్యటన సందర్భంగా హెలీప్యాడ్ వద్ద చోటుచేసుకున్న తోపులాటలో గాయపడ్డ కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తోపుదుర్తిపై కేసు నమోదు చేశారు. హెలీప్యాడ్ వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు సరిగా లేవని తోపుదుర్తి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆయన పట్టించుకోలేదని పోలీసులు చెబుతున్నారు.
హెలీప్యాడ్ నిర్వహణ సరిగా లేదని ప్రకాశ్ రెడ్డికి డీఎస్పీ స్వయంగా చెప్పారని పోలీసులు చెబుతున్నారు. హెలీప్యాడ్ వద్దకు వైసీపీ కార్యకర్తలందరూ వెళ్లాలని తోపుదుర్తి చెప్పారని... ఈ సందర్భంగా హెలీప్యాడ్ వద్ద డీఎస్పీతో ప్రకాశ్ రెడ్డి వాగ్వాదానికి దిగారని పోలీసులు తెలిపారు. ప్రకాశ్ రెడ్డి రెచ్చగొట్టడంతోనే జగన్ వచ్చినప్పుడు బ్యారికేడ్లను తోసుకుని వైసీపీ కార్యకర్తలు వెళ్లినట్టు పోలీసులు చెబుతున్నారు.