Chiranjeevi: ‘విశ్వంభర’ నుంచి మెగా అప్‌డేట్.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్!

- చిరంజీవి, వశిష్ట కాంబోలో ‘విశ్వంభర’
- ఏప్రిల్ 12న ‘రామ రామ’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటన
- బాల హనుమాన్‌లతో చిరు ఉన్న కొత్త పోస్టర్‌ను పంచుకున్న మేకర్స్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు చిత్రం యూనిట్ ప్రకటించింది. ‘రామ రామ’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా బాల హనుమాన్‌లతో చిరు ఉన్న కొత్త పోస్టర్‌ను మేకర్స్ పంచుకున్నారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి బాణీలు అందిస్తున్నారు. సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తోంది. ఇక గతేడాది దసరా కానుకగా ‘విశ్వంభర’ టీజర్ విడుదల కాగా... మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలో విడుదల తేదీని కూడా ప్రకటిస్తారని సమాచారం.