YS Bharathi: వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు.. ఐటీడీపీ కార్యకర్తపై టీడీపీ వేటు

--
మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని తెలుగుదేశం పార్టీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్టీ కార్యకర్తపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది.
మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పింది. అంతేకాదు, చేబ్రోలు కిరణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలను అధిష్ఠానం ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు పార్టీ నేతలు ఫిర్యాదు చేయగా.. చేబ్రోలు కిరణ్ పై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు.