ఎన్టీఆర్ మనవడు కదా... ఆ గుణాలు ఎక్కడికి పోతాయి?: విజయశాంతి

  • నటుడు కల్యాణ్ రామ్ వ్యక్తిత్వాన్ని ప్రశంసించిన నటి విజయశాంతి
  • కల్యాణ్ రామ్ హీరోగా, విజయశాంతి కీలక పాత్ర చేస్తున్న మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి ఈ నెల 18న విడుదల
  • క్రమశిక్షణ కల్గిన వ్యక్తి కల్యాణ్ రామ్ అంటూ విజయశాంతి కితాబు   
నటుడు నందమూరి కల్యాణ్ రామ్ వ్యక్తిత్వాన్ని నటి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ విజయశాంతి కొనియాడారు. కల్యాణ్ రామ్ హీరోగా, విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' చిత్రం ఈ నెల 18న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, తాజాగా చిత్రంలోని ఓ పాట విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కల్యాణ్ రామ్ వ్యక్తిత్వాన్ని విజయశాంతి ప్రశంసించారు. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని పేర్కొంటూ, ఇందులో కల్యాణ్ రామ్ అద్భుతంగా నటించారని అన్నారు. ఆయన యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ సమానమైన గౌరవం ఇస్తారని తెలిపారు. కల్యాణ్ రామ్ ఎంతో క్రమశిక్షణ కలిగిన నటుడని కితాబిచ్చారు.

సీనియర్ ఎన్టీఆర్ మనవడు కదా, ఆ గుణాలు ఎక్కడికి పోతాయని, ఆయన తాతయ్య నుంచి కల్యాణ్ రామ్‌కు క్రమశిక్షణ వచ్చిందని అన్నారు. ఈ చిత్రంలో నటిస్తున్నంతసేపు చాలా ఆనందంగా అనిపించిందని విజయశాంతి పేర్కొన్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. 


More Telugu News