Sanju Samson: ఐపీఎల్ లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్... టాస్ అప్ డేట్ ఇదిగో!

- ఐపీఎల్ లో ఇవాళ గుజరాత్ టైటాన్స్ × రాజస్థాన్ రాయల్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
- అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్
ఐపీఎల్ లో ఇవాళ ఆసక్తికర సమరం జరగనుంది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ ఢీకొంటున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగ వ్యక్తిగత కారణాలతో ఈ మ్యాచ్ ఆడడం లేదని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ వెల్లడించాడు. అతడి స్థానంలో లెఫ్టార్ సీమర్ ఫజల్ హక్ ఫరూఖీ తుది జట్టులోకి వచ్చాడని వివరించాడు. అటు, గుజరాత్ టైటాన్స్ టీమ్ లో ఎలాంటి మార్పులు లేవని కెప్టెన్ శుభ్ మాన్ గిల్ తెలిపాడు. గత మ్యాచ్ లో ఆడిన జట్టునే బరిలోదింపుతున్నామని పేర్కొన్నాడు.
కాగా, ఐపీఎల్ 18వ సీజన్ లో ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్ లు ఆడి మూడింట గెలవగా... రాజస్థాన్ రాయల్స్ 4 మ్యాచ్ లు ఆడి రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించింది.