Sachin Tendulkar: కజిరంగా నేషనల్ పార్క్‌లో సచిన్ జీపు సఫారీ... ఇదిగో వీడియో!

భారత మాజీ కెప్టెన్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తాజాగా అసోంలో పర్యటించారు. ఇందులో భాగంగా అక్కడి కజిరంగా నేషనల్ పార్క్‌ను సందర్శించారు. పార్క్‌లో జీపు సఫారీ చేస్తూ ఎంతో సరదాగా గడిపారు. అక్కడ ఏనుగులకు ఆహారం కూడా అందించారు.
ఇక సచిన్ రాకతో అక్కడికి భారీగా అభిమానులు చేరుకున్నారు. లిటిల్ మాస్టర్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. కజిరంగా నేషనల్ పార్క్‌లో సచిన్ జీపు సఫారీ తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.