Nadeendla Manohar: ఢిల్లీ ఏపీ భవన్ లోని పౌరసరఫరాల శాఖ దుకాణంలో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీ

- బియ్యం నాణ్యతను పరిశీలించిన మంత్రి నాదెండ్ల
- బియ్యం బస్తా తూకంలో తేడా రావడంతో సిబ్బందిపై ఆగ్రహం
- ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న దుకాణం సీజ్
- ఇకపై ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దుకాణం నడుస్తుందని ప్రకటన
ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఉన్న పౌరసరఫరాల శాఖ దుకాణాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేడు ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ అందుబాటులో ఉంచిన బియ్యం నాణ్యతను పరిశీలించారు. బియ్యం బస్తా తూకంలో తేడా రావడంతో సిబ్బందిపై మంత్రి నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసరఫరాల శాఖ పేరుతో ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న ఆ దుకాణాన్ని సీజ్ చేశారు.
ఏపీ భవన్ లో నెల రోజుల్లో ప్రభుత్వ దుకాణం ఏర్పాటు చేస్తామని మంత్రి అక్కడిక్కడే ప్రకటించారు. ఇకపై ఏపీ భవన్ లోని దుకాణం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలోనే నడుస్తుందని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో మంత్రి నాదెండ్లతో పాటు పౌరసరఫరాల శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ కూడా పాల్గొన్నారు.