Greenfield Express Highway: తెలుగు రాష్ట్రాల‌కు కేంద్రం శుభవార్త‌... గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్న‌ల్‌

Green Signal for Greenfield Expressway Connecting Andhra Pradesh and Telangana

  • హైద‌రాబాద్‌, అమ‌రావతి మ‌ధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే
  • తాజాగా రోడ్డు నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ 
  • ఏపీ, తెలంగాణ మ‌ధ్య క‌నెక్టివిటీని పెంచేందుకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం

కేంద్రంలోని ఎన్‌డీఏ ప్ర‌భుత్వం రెండు తెలుగు రాష్ట్రాల‌కు శుభావార్త చెప్పింది. ఏపీ, తెలంగాణ మ‌ధ్య క‌నెక్టివిటీని పెంచేందుకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించాల‌ని నిర్ణ‌యించింది. హైద‌రాబాద్‌, అమ‌రావతి మ‌ధ్య దీన్ని నిర్మించేందుకు ప్ర‌ణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా తాజాగా రోడ్డు నిర్మాణానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. 

డీపీఆర్‌లు సిద్ధం చేసి ప‌నులు ప్రారంభించ‌నుంది. అటు, త్వ‌ర‌లోనే అమ‌రావ‌తి రింగ్ రోడ్డు ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఈ ఆర్ఆర్‌కు ఉత్త‌ర‌భాగం నుంచి హైవే నిర్మాణానికి అనుమ‌తి ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న‌ట్లు స‌మాచారం.   


Greenfield Express Highway
NDA Government
Greenfield Expressway
Amaravati
Hyderabad
Andhra Pradesh
Telangana
Connectivity
Highway Construction
Road Project
Expressway
  • Loading...

More Telugu News