Tamil Nadu-Kerala Bus: వామ్మో ఇదేం బస్సు... డ్రైవర్ నడుపుతుంటే, కండక్టర్ గేర్లు మారుస్తున్నాడు!

సాధారణంగా ఏదైనా ఫోర్ వీలర్ వాహనాన్ని నడిపేటప్పుడు డ్రైవర్ ఓ చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేసుకుంటూ, మరో చేత్తో గేర్లు మార్చుకోవడం తెలిసిందే. కానీ, తమిళనాడు-కేరళ సరిహద్దు ప్రాంతంలో తిరిగే ఓ బస్సులో డ్రైవర్ స్టీరింగ్ తిప్పుతుంటే, కండక్టర్ కింద కూర్చుని గేర్లు మార్చుతున్నాడు. ఆ బస్సుకు గేర్ రాడ్ లేకపోవడంతో, డ్రైవర్ సూచనలకు అనుగుణంగా... కండక్టర్ ఓ స్క్రూడ్రైవర్ వంటి సాధనంతో గేర్లు షిఫ్ట్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.