Sapthagiri: సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం

- సప్తగిరి తల్లి చిట్టెమ్మ కన్నుమూత
- బెంగళూరులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన చిట్టెమ్మ
- ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు
సినీ నటుడు సప్తగిరి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సప్తగిరి తల్లి చిట్టెమ్మ తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చిట్టెమ్మ బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు తిరుపతిలోని పద్మాపురం ఎదురుగా ఉన్న శ్రీనివాసపురంలో ఈరోజు జరగనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. చిట్టెమ్మ భౌతికకాయానికి నివాళి అర్పించేందుకు పలువురు సినీ ప్రముఖులు రానున్నట్టు సమాచారం.
సినిమాల విషయానికి వస్తే సప్తగిరి కమెడియన్ గానే కుండా హీరోగా కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. ఇందులో ప్రభాస్ సినిమా 'రాజాసాబ్' కూడా ఒకటి.