RBI: వ‌రుస‌గా రెండోసారి వ‌డ్డీ రేట్లు స‌వ‌రించిన ఆర్‌బీఐ

RBI Cuts Repo Rate for Second Consecutive Time

  • రెపో రేటుపై 25 బేసిస్ పాయింట్లు త‌గ్గింపు
  • 6.25 నుంచి 6 శాతానికి దిగొచ్చిన రెపో రేటు 
  • హోమ్‌, వెహిక‌ల్‌, ప‌ర్స‌న‌ల్ రుణాల‌పై త‌గ్గ‌నున్న వ‌డ్డీరేట్లు

భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) వ‌రుస‌గా రెండోసారి కీల‌క వ‌డ్డీ రేట్ల‌ను స‌వ‌రించింది. రెపో రేటును 0.25 శాతం మేర త‌గ్గించింది. దీంతో 6.25 నుంచి 6 శాతానికి రెపో రేటు దిగొచ్చింది. ఈ మేర‌కు ద్ర‌వ్య‌ ప‌ర‌ప‌తి విధాన క‌మిటీ నిర్ణ‌యాల‌ను ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ సంజ‌య్ మ‌ల్హోత్రా వెల్ల‌డించారు. దీంతో హోమ్‌, వెహిక‌ల్‌, ప‌ర్స‌న‌ల్ రుణాల‌పై వ‌డ్డీరేట్లు త‌గ్గ‌నున్నాయి. 

కాగా, ఫిబ్ర‌వ‌రిలోనూ వ‌డ్డీ రేట్ల‌ను 25 బేసిస్ పాయింట్ల మేర త‌గ్గించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం దేశీయంగా ద్ర‌వ్యోల్బ‌ణం నియంత్ర‌ణ ద‌శ‌లోనే ఉంది. 2025 ఫిబ్ర‌వ‌రిలో రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం 3.6 శాతానికి దిగొచ్చింది. ప్ర‌ధానంగా ఆహార ప‌దార్థాల ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో రిటైల్ ద్ర‌వ్యోల్బ‌ణం త‌గ్గింది. ఈ క్ర‌మంలోనే బ‌లహీనంగా ఉన్న ఆర్థిక వృద్ధికి ప్రాధాన్య‌త ఇవ్వ‌డం కోసం వడ్డీ రేట్ల‌ను ఆర్‌బీఐ త‌గ్గించింది. 

ఇక, ఇటీవ‌ల అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించిన ప్ర‌తీకార సుంకాల ప్ర‌భావంతో ప్ర‌పంచ వాణిజ్యంపై ఆందోళ‌న‌లు పెరిగిన సంగ‌తి తెలిసిందే. దీంతో యూఎస్‌కు కీల‌క ఎగుమ‌తిదారుగా ఉన్న ఇండియాలో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు, దేశీయంగా వినియోగం, పెట్టుబ‌డుల సామ‌ర్థ్యాన్ని కొన‌సాగించేందుకు వ‌డ్డీ రేట్ల‌పై ఆర్‌బీఐ కోత విధించింది.     

RBI
Repo Rate
Interest Rates
Monetary Policy
Inflation
Sanjay Malhotra
Economic Growth
US Tariffs
India Economy
Financial Markets
  • Loading...

More Telugu News