SRH: పబ్‌లో సన్‌రైజర్స్ టీమ్ సందడి.. ఇదిగో వీడియో!

పబ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) టీమ్ సందడి చేసింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్. 45లోని ఓ పబ్‌కి సన్‌రైజర్స్ జట్టు సభ్యులు తమ కుటుంబాలతో కలిసి వచ్చారు. ఎస్ఆర్‌హెచ్ టీమ్ రాకతో వారిని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో పబ్ పరిసరాలు సందడిగా మారాయి. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదిలాఉంటే... ఈ సీజన్ హైదరాబాద్ జట్టు అనుకున్నంత స్థాయిలో రాణించడం లేదనే విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో విజయంతో ఐపీఎల్ 2025ను ఘనంగా ప్రారంభించిన ఎస్ఆర్‌హెచ్... ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లలో పరాజయం పాలైంది. ఆడిన ఐదులో మ్యాచ్‌లలో ఒక విజయం, నాలుగు ఓటములతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది.