Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ప్రధాని మోదీ

Mark Shankar Pawanovich Injured PM Modis Call to Pawan Kalyan

  • సింగపూర్ లో అగ్నిప్రమాదంలో గాయపడ్డ పవన్ కుమారుడు
  • చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి పవన్ కు ఫోన్ చేసి తెలుసుకున్న ప్రధాని
  • సింగపూర్ లో ఎలాంటి సహాయం కావాలన్నా తాను సిద్ధంగా ఉన్నానని హామీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ అగ్నిప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. సింగపూర్ లో మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. 

మార్క్ శంకర్ గాయపడ్డ విషయం తెలుసుకున్న ప్రధాని మోదీ... పవన్ కల్యాణ్ కు ఫోన్ చేశారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయం తెలుసుకుని... చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ధైర్యంగా ఉండాలని పవన్ కు చెప్పారు. సింగపూర్ లో ఎలాంటి సహాయం కావాలన్నా తాను సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు.

Pawan Kalyan
PM Modi
Mark Shankar Pawanovich
Singapore fire accident
AP Deputy CM
child injury
Modi calls Pawan Kalyan
support for Pawan Kalyan
  • Loading...

More Telugu News