Ponguleti Srinivas Reddy: పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Announces 10 Minute Document Registration in Telangana

  • స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం
  • ఏప్రిల్ 10వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్
  • తొలుత ప్రయోగాత్మకంగా 22 కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్

తెలంగాణ రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 'స్లాట్ బుకింగ్' విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ అమల్లోకి వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

ప్రారంభంలో ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. స్లాట్ బుకింగ్ ద్వారా 10-15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు.

పత్రాల రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి నిరీక్షించే అవసరం లేకుండా ఈ స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురానున్నట్లు ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో మంత్రి తెలిపారు.

హైదరాబాద్‌లోని అజంపుర, చిక్కడపల్లి, సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట, మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్, వల్లభ్ నగర్, రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, సరూర్ నగర్, చంపాపేట, పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, ఖమ్మం, మేడ్చల్, మహబూబ్ నగర్, జగిత్యాల, నిర్మల్, వరంగల్ పోర్టు, వరంగల్ రూరల్, కొత్తగూడెం, ఆర్మూర్, భువనగిరి, చౌటుప్పల్, నాగర్ కర్నూలుతో సహా మొత్తం 22 చోట్ల ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు.

Ponguleti Srinivas Reddy
Telangana
Sub Registrar Offices
Slot Booking
Document Registration
Online Registration
Hyderabad
Real Estate
Property Registration
April 10th
  • Loading...

More Telugu News