Travis Head: అభిమానులతో సెల్ఫీకి నిరాకరించిన ట్రావిస్ హెడ్... ఫ్యాన్స్ ఫైర్!

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ తీరుపై అభిమానులు మండిపడుతున్నారు. ఇటీవల ఓ షాపింగ్ మాల్‌లో కనిపించిన హెడ్‌ను అభిమానులు సెల్ఫీ అడిగారు. కానీ హెడ్ వారితో సెల్ఫీ దిగేందుకు నిరాకరించాడు.
వారు వెంటపడి బతిమాలినా కనికరించలేదు. చివరికి చిన్నపిల్లలు అడిగిన స్పందించలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతో అభిమానించే తమ పట్ల ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్ ఇలా ప్రవర్తించడం ఏంటని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కొందరు మాత్రం... సెల్ఫీ ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది అతడి ఇష్టమని, ఫొటోల కోసం వేధించడం కరెక్ట్ కాదని కామెంట్లు పెడుతున్నారు.