Revanth Reddy: పవన్ కుమారుడికి ప్రమాదం... స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

- స్కూలులో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు గాయాలు
- ఈ ఘటనపై 'ఎక్స్' వేదికగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
- బాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించిన ముఖ్యమంత్రి మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో స్కూల్ సిబ్బంది బాబును ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, కొద్దిసేపటి క్రితమే మన్యం జిల్లా పర్యటన ముగించుకుని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు. మరికాసేపట్లో జనసేనాని సింగపూర్ బయల్దేరి వెళ్లనున్నారు. పవన్ అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖ కూడా సింగపూర్ వెళుతున్నారని సమాచారం.