Simhachalam: హైదరాబాద్‌లో ట్రక్కు ఢీకొని ట్రాఫిక్ హోంగార్డు మృతి

Hyderabad Traffic Constable Dies in Tragic Truck Accident

  • మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో దుర్ఘటన
  • అదుపు తప్పి ట్రాఫిక్ అంబ్రెల్లాను ఢీకొన్న ట్రక్కు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు ట్రాఫిక్ సిబ్బంది
  • కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్న పోలీసు

హైదరాబాద్‌లోని మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ట్రాఫిక్ హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మెట్రో స్టేషన్ సమీపంలో రాత్రి విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ సిబ్బందిపైకి ఒక ట్రక్కు దూసుకెళ్లడంతో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది.

కూకట్‌పల్లి నుంచి మియాపూర్ దిశగా వెళుతున్న ట్రక్కు, యూటర్న్ సమీపంలో అదుపు తప్పి ట్రాఫిక్ అంబ్రెల్లాను ఢీకొట్టింది. ఆ సమయంలో ముగ్గురు ట్రాఫిక్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు సిబ్బందిని గచ్చిబౌలిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

తీవ్రంగా గాయపడిన సింహాచలం చికిత్స పొందుతూ మరణించారు. మరో ఇద్దరు ట్రాఫిక్ సిబ్బంది రాజవర్ధన్, వికేందర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ట్రక్కును అతివేగంతో నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Simhachalam
Hyderabad Accident
Miyapur Metro Station
Truck Accident
Rajavardhan
Vikender
Road Accident Hyderabad
Police Investigation
Traffic Police
  • Loading...

More Telugu News