Mark Shankar: మార్క్ శంకర్ ని చూసేందుకు సింగపూర్ వెళుతున్న చిరంజీవి దంపతులు

- సింగపూర్ స్కూళ్లో అగ్నిప్రమాదం
- పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కి గాయాలు
- ఈ దుర్ఘటనలో ఒక బాలిక మృతి
సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డ సంగతి తెలిసిందే. ఎనిమిదేళ్ల మార్క్ ప్రస్తుతం సింగపూర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో దాదాపు 20 మంది చిన్నారులు గాయపడ్డారు. పదేళ్ల బాలిక మృతి చెందింది.
ఈ ఘటనపై చిరంజీవి స్పందిస్తూ మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు. మరోవైపు, మార్క్ శంకర్ ను చూసేందుకు చిరంజీవి, ఆయన భార్య సురేఖ సింగపూర్ కి వెళ్లనున్నారు. పవన్ కల్యాణ్ కూడా సింగపూర్ కి వెళుతున్నారు.