Ram Charan: రామ్ చరణ్ 'పెద్ది' సినిమాపై రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Ram Gopal Varmas Tweet on Ram Charans Peddi

  • రామ్ చరణ్ హీరోగా పెద్ది
  • బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చిత్రం
  • ట్రిపుల్ సిక్సర్ గ్యారంటీ అంటూ వర్మ జోస్యం

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సానా బుచ్చిబాబు కాంబోలో వస్తున్న పెద్ది మూవీపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. పెద్ది అసలైన, నిజమైన గేమ్ చేంజర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని పేర్కొన్నారు. రామ్ చరణ్ గ్లోబల్ స్థాయిలో కాదు, యూనివర్సల్ స్థాయిలో కనిపిస్తున్నాడని కితాబిచ్చారు.

హేయ్ సానా బుచ్చిబాబు... రాజమౌళి నుంచి నా వరకు ఏ దర్శకుడు కూడా రామ్ చరణ్ శక్తిని నువ్వు అర్థం చేసుకున్నంత ఎక్కువగా మేం అర్థం చేసుకోలేకపోయాం... నీ సినిమా గ్యారంటీగా ట్రిపుల్ సిక్సర్ కొడుతుంది" అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు పెద్ది ఫస్ట్ షాట్ గ్లింప్స్ వీడియోను కూడా పంచుకున్నారు. 

Ram Charan
Peddi Movie
Ram Gopal Varma
Sana Buchibabu
Telugu Cinema
Tollywood
Game Changer
Universal Star
RRR
Film Industry
  • Loading...

More Telugu News