Delhi Metro: అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఢిల్లీ మెట్రో... మరో వీడియో వైరల్!

అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ సంఘటన తాలూకు వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో ఓ యువకుడు రైలులో కూర్చొని మద్యం తాగుతూ ఉడికించిన గుడ్డు తింటూ కనిపించాడు.
ఇతర ప్రయాణికులు చూస్తున్నా అతను మద్యం సేవించడం ఆపలేదు. ఓ వ్యక్తి ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరలవుతోంది. దీంతో ఈ వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.