Mark Shankar: పవన్ తనయుడికి ప్రమాదంపై రోజా స్పందన

Mark Shankars Accident Rojas Response

  • సింగపూర్ లోని ఓ స్కూల్లో అగ్నిప్రమాదం
  • పవన్ కుమారుడు మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలు
  • ఊపిరితిత్తుల్లోకి పొగ 
  • ఆసుపత్రిలో చికిత్స
  • ఈ ప్రమాదం ఎంతో కలచివేసిందన్న రోజా 

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని స్కూల్లో అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లింది. ప్రస్తుతం మార్క్ శంకర్ సింగపూర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంపై మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా స్పందించారు. 

"ఈ రోజు పవన్ కల్యాణ్ గారి చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసును ఎంతో కలచివేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని, దీర్ఘాయుష్షు కలిగి ఆరోగ్యవంతుడై కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలని భగవంతుడ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను" అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

ప్రస్తుతం ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం సింగపూర్ వెళ్లనున్నారు.

Mark Shankar
Pawan Kalyan
Roja
Singapore School Fire
Accident
Injury
AP Deputy CM
YCP Leader
Son's Accident
  • Loading...

More Telugu News