Elon Musk: ట్రంప్ కు మస్క్ కీలక సూచన

Musk Urges Trump to End China Tariffs

  • టారిఫ్ లపై తగ్గడమే మేలన్న డోజ్ సారథి
  • చైనాతో ట్రేడ్ వార్ పై ప్రభుత్వానికి హితవు
  • అమెరికా మీడియా కథనాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ లపై డోజ్ సారథి, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తొలిసారి స్పందించినట్లు తెలుస్తోంది. చైనా విషయంలో టారిఫ్ యుద్ధాన్ని ఆపాలని, ఈ విషయంలో కాస్త తగ్గితేనే మేలని ట్రంప్ కు సూచించారని సమాచారం. ఇటీవల ట్రంప్ తో జరిగిన భేటీలో మస్క్ ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్లు తెలిసింది. అయితే, ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ఈ మేరకు పలు ఆంగ్ల మీడియాలు కథనాలు వెల్లడిస్తున్నాయి. 

ఈ కథనాల ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్‌తో మస్క్‌ నేరుగా చర్చలు జరిపారు. చైనాపై టారిఫ్‌ లు విధించే విషయంలో మరోమారు ఆలోచించాలని కోరారు. దీనికి ట్రంప్ నిరాకరించారని, టారిఫ్ ల విషయంలో తగ్గేదేలేదని ఖరాఖండిగా చెప్పినట్లు సమాచారం.

Elon Musk
Donald Trump
US-China Trade War
Tariffs
Trade Disputes
Tesla
China Tariffs
Musk Trump Meeting
Economic Sanctions
  • Loading...

More Telugu News