Mark Shankar: మార్క్ శంకర్ కు గాయాలపై చంద్రబాబు స్పందన

Pawan Kalyans Son Mark Shankar Suffers Injuries in School Fire Chandrababu Naidu Responds

  • సింగపూర్ లో చదువుకుంటున్న మార్క్ శంకర్
  • స్కూల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో చిన్నారికి గాయాలు
  • చిన్నారికి గాయాలయ్యాయనే విషయం ఆందోళన కలిగించిందన్న చంద్రబాబు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డ సంగతి తెలిసిందే. సింగపూర్ లో మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు. మార్క్ శంకర్ కు గాయాలైన విషయం ఆందోళన కలిగించిందని చెప్పారు. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మార్క్ శంకర్ గాయపడటంపై పెదనాన్న చిరంజీవి, ఏపీ మంత్రి నారా లోకేశ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. 

Mark Shankar
Pawan Kalyan's son
Singapore school fire
Chandrababu Naidu
Chiranjeevi
Nara Lokesh
KTR
Accident
Injury
  • Loading...

More Telugu News