ప‌వ‌న్ కుమారుడికి గాయాలు.. దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన మంత్రి లోకేశ్‌

  • స్కూలులో జ‌రిగిన అగ్ని ప్ర‌మాదంలో ప‌వ‌న్ చిన్న కుమారుడు మార్క్ శంక‌ర్‌కు గాయాలు
  • ఈ ఘ‌ట‌న‌పై ఎక్స్ వేదిక‌గా స్పందించిన మంత్రి నారా లోకేశ్‌
  • బాబు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు లోకేశ్ ట్వీట్
సింగ‌పూర్‌లో జ‌రిగిన‌ అగ్నిప్ర‌మాదంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంక‌ర్ గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే. స్కూలులో జ‌రిగిన ఈ ప్ర‌మాదంలో బాబుకు గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌పై విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. బాలుడు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని, ఈ క‌ష్ట స‌మ‌యంలో ప‌వ‌న్ కుటుంబానికి ధైర్యం ఇవ్వాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్న‌ట్లు లోకేశ్ ట్వీట్ చేశారు.  

"సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి విని షాక్ అయ్యాను. అందులో అన్న పవన్ కల్యాణ్
కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలు అయ్యాయ‌ని తెలిసి దిగ్భ్రాంతికి గుర‌య్యాను. బాబు త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో ప‌వ‌న్‌ కుటుంబానికి బలం ఇవ్వాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని మంత్రి లోకేశ్ రాసుకొచ్చారు. 

కాగా, సింగ‌పూర్‌లోని రివ‌ర్‌వ్యాలీ షాప్‌హౌస్‌లో మంగ‌ళ‌వారం ఉద‌యం 9.45 గంట‌ల‌కు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ భ‌వ‌నంలో చిన్నారుల‌కు క్యాంప్ నిర్వ‌హిస్తున్నారు. రెండు, మూడు అంత‌స్తుల్లో మంట‌లు చెల‌రేగ‌డంతో రెస్క్యూ సిబ్బంది ప్ర‌మాదాస్థ‌లికి చేరుకుని లోప‌ల చిక్కుకున్న వారిని ర‌క్షించి బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. ఈ ప్ర‌మాదంలో 15 నుంచి 19 మంది గాయ‌ప‌డ్డారు. 

మార్క్ శంక‌ర్‌ చేతులు, కాళ్ల‌కు గాయాల‌య్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ల‌డంతో స్కూల్ సిబ్బంది మార్క్ శంక‌ర్‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న ప‌వ‌న్‌... ప్ర‌స్తుతం తాను ప‌ర్య‌టిస్తున్న అల్లూరి సీతారామ‌రాజు జిల్లా ప‌ర్య‌ట‌న పూర్తి చేసుకున్న త‌ర్వాత సింగ‌పూర్ వెళ్లనున్నార‌ని స‌మాచారం.   

సింగ‌పూర్‌లో ప్ర‌మాదం జ‌రిగిన పాఠ‌శాల ఇదే...


More Telugu News