బీజేపీ చెప్పిన అచ్చేదిన్ అంటే ఇదేనా?... ఎన్‌డీఏ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్!
అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రం ఎల్‌పీజీ సిలిండర్ల ధరను రూ. 50 పెంపు, ఇంధనంపై అదనంగా రూ. 2 ఎక్సైజ్ సుంకాన్ని విధించిందని విమర్శించారు. సెన్సెక్స్ పతనంతో ఒకే రోజులో రూ. 19 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయని, ఇది వాగ్దానం చేసిన అచ్ఛే దిన్ కు సంకేతమా? లేక మేక్ ఇండియా గ్రేట్ ఎగైన్ ప్రారంభమా? అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.