Allu Arjun: అల్లు అర్జున్ కొత్త సినిమా అప్‌డేట్ వ‌చ్చేసింది!

Allu Arjuns Next Film with Atlee A Hollywood Style Visual Spectacle

  • బ‌న్నీతో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అట్లీ తెర‌కెక్కించ‌నున్న 'ఏఏ22' చిత్ర ప్ర‌క‌ట‌న
  • వీడియోను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్న స‌న్ పిక్చ‌ర్స్
  • ల్యాండ్‌మార్క్ సినిమాటిక్ ఈవెంట్ కోసం సిద్ధం అవ్వండి అంటూ ట్వీట్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న న‌టించ‌నున్న కొత్త సినిమా నుంచి అప్‌డేట్ వ‌చ్చింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అట్లీ తెర‌కెక్కించ‌నున్న 'ఏఏ22' చిత్ర ప్ర‌క‌ట‌న వీడియోను నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ సోష‌ల్ మీడియాలో పోస్ట్‌ చేసింది. 

అట్లీ, బ‌న్నీ ప్రాజెక్ట్ వివ‌రాల‌ను వీడియోలో పంచుకుంది. ఈ మూవీ ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్న‌ట్లు వీడియోలో చూపించారు. అభిమానుల ఊహ‌ల‌కు అంద‌ని విధంగా సినిమా ఉండ‌నుంద‌ని తెలిపింది. హాలీవుడ్ త‌ర‌హాలో విజువ‌ల్స్ ఉండ‌నున్నాయి. దీనికోసం అట్లీ, అల్లు అర్జున్ లాస్ ఏంజెలెస్‌లోని ప్ర‌ముఖ వీఎఫ్ఎక్స్ సంస్థ‌ను సంప్ర‌దించారు. వీఎఫ్ఎక్స్ నిపుణులు కూడా ఇప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి స్క్రిప్ట్ చూడ‌లేద‌ని చెప్ప‌డం వీడియోలో ఉంది. బ‌న్నీ స్క్రీన్ టెస్ట్ విజువ‌ల్స్ కూడా ఇందులో చూపించారు.  

"ల్యాండ్‌మార్క్ సినిమాటిక్ ఈవెంట్ #AA22xA6 కోసం సిద్ధం అవ్వండి. సన్ పిక్చర్స్ నుంచి ఒక గొప్ప ప్రయత్నం!" అంటూ ట్వీట్ చేసింది. 

ఇక చాలా రోజులుగా ఈ కాంబినేష‌న్‌పై వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు అదే నిజం చేస్తూ నిర్మాణ సంస్థ అల్లు అర్జున్‌కు బ‌ర్త్ డే విషెస్ కూడా తెలిపింది. పుష్ప‌-2 వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత బ‌న్నీ... జ‌వాన్ వంటి  సూప‌ర్ హిట్ త‌ర్వాత అట్లీ చేస్తున్న ప్రాజెక్ట్ కావ‌డంతో దీనిపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇక ఇది అల్లు అర్జున్‌కు 22వ చిత్రం కాగా, అట్లీకి ద‌ర్శ‌కుడిగా 6వ మూవీ. ఈ ప్రాజెక్టు సంబంధించి త్వ‌ర‌లో అన్ని వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి. 

Allu Arjun
Allu Arjun new movie
AA22
Atlee
Sun Pictures
South Indian Cinema
Telugu Cinema
Tollywood
Bollywood
Hollywood VFX
  • Loading...

More Telugu News