Child Death: వాటర్ వరల్డ్ లో బాలుడు మృతి.. విశాఖలో దారుణం

Child Dies at Visakhapatnam Water World

--


విశాఖపట్నంలో మంగళవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నగరంలోని విశ్వనాథ్ స్పోర్ట్స్  క్లబ్ ఆవరణలోని వాటర్ వరల్డ్ లో ఓ బాలుడు మృతి చెందాడు. నీటిలో దిగిన రిషి(7)  అనే బాలుడు అస్వస్థతకు గురికాగా.. నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా బైక్ పై ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రిషిని ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసి హుటాహుటిన అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులకు వైద్యులు దుర్వార్త చెప్పారు. ఆసుపత్రికి తీసుకువచ్చేలోపే రిషి తుదిశ్వాస వదిలాడని వైద్యులు నిర్ధారించారు.

వాటర్ వరల్డ్ లోనే రిషి మరణించాడని, దీనిని కప్పిపుచ్చేందుకు నిర్వాహకులు ప్రయత్నించారని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి యాజమాన్యం సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం రిషి మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Child Death
Visakhapatnam Water World
Visakhapatnam Accident
Sports Club Accident
Negligence
Private Hospital
Police Investigation
Andhra Pradesh
  • Loading...

More Telugu News