పోసానికి నోటీసులు ఇచ్చిన సూళ్లూరుపేట పోలీసులు
- పవన్, లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసు
- విచారణకు హాజరు కావాలంటూ పోసానికి సూళ్లూరుపేట పోలీసుల నోటీసులు
- ఇప్పటికే రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడిపిన పోసాని
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై ఏపీ వ్యాప్తంగా 15కు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఆయన పలు జైళ్లలో రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడిపారు. గత నెలలో ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.