శంషాబాద్ విమానాశ్రయం సరికొత్త రికార్డు
- ప్రయాణికుల రాకపోకల్లో గణనీయమైన వృద్ధి సాధించిన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్
- గత ఆర్థిక సంవత్సరంలో 2.13 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు
- ఒక నెలలో ప్రయాణించే వారి సంఖ్య కూడా ఎక్కువే
- మెట్రో నగరాలు చెన్నై, కోల్‌కతాను అధిగమించిన రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్ట్
ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకల్లోనూ ఈ ఎయిర్‌పోర్టు మరో రికార్డు నెలకొల్పింది. ఇక్కడి నుంచి ఒక నెలలో ప్రయాణించే వారి సంఖ్య గరిష్ఠంగా 20 లక్షలే కాగా, ఈసారి మాత్రం ఈ మూడు నెలల్లో ఏకంగా 74 లక్షల మంది రాకపోకలు సాగించారు. ఈ క్రమంలో చెన్నై, కోల్‌కతాలను అధిగమించింది. అలాగే, హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి నెలకు 93 వేలమంది, దోహాకు 42 వేల మంది, అబుధాబికి 38 వేల మంది, జెడ్డాకు 31 వేల మంది, సింగపూర్‌కు 31 వేల మంది రాకపోకలు సాగిస్తున్నట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు.