Virat Kohli: టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

- ఇవాళ ముంబయి ఇండియన్స్ పై కోహ్లీ అర్థసెంచరీ
- టీ20 క్రికెట్లో 13 వేల పరుగులు పూర్తి
- అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన తొలి భారత బ్యాటర్ గా రికార్డు
- 13 వేల మార్కును చేరుకున్న తొలి భారత ఆటగాడిగానూ రికార్డు
ముంబయి వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 13,000 పరుగులు చేసిన భారత బ్యాట్స్ మన్ గా చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్‌లో 13 వేల పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా కూడా నిలిచాడు. కోహ్లీ 386 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత అందుకున్నాడు.
నేటి మ్యాచ్‌లో కోహ్లీ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్ బాది అభిమానులను అలరించాడు. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
టీ20 క్రికెట్లో 13,000 పరుగులు చేసిన ఆటగాళ్లు
1. క్రిస్ గేల్- 14,562 పరుగులు (381 ఇన్నింగ్స్ లు)
2. అలెక్స్ హేల్స్- 13,610 పరుగులు (474)
3. షోయబ్ మాలిక్- 13,557 పరుగులు (487)
4. కీరన్ పొలార్డ్- 13,537 పరుగులు (594)
5. విరాట్ కోహ్లీ- 13,050 పరుగులు (386)