Virat Kohli: రాణించిన కోహ్లీ... పటిదార్, జితేశ్ మెరుపులు... ఆర్సీబీ భారీ స్కోరు

- ఐపీఎల్ లో నేడు ముంబయి ఇండియన్స్ × రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంయి
- 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులు చేసిన ఆర్సీబీ
ఐపీఎల్ 18వ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎంతో మెరుగైన ఆటతీరు కనబరుస్తోంది. ఇవాళ ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో భారీ స్కోరు సాధించింది. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ రాణించగా... కెప్టెన్ రజత్ పటిదార్, వికెట్కీపర్జితేశ్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులు చేసింది.
ఓపెనర్ ఫిల్ సాల్ట్ 4 పరుగులకే అవుటైనా... కోహ్లీ, పడిక్కల్ జోడీ స్కోరు బోర్డును నడిపించింది. కోహ్లీ 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 67 పరుగులు చేయగా... పడిక్కల్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 37 పరుగులు చేశాడు.
ఇక, కెప్టెన్ పటిదార్ దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ నమోదు చేశాడు. పటిదార్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 64 పరుగులు చేయగా... జితేశ్ 19 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 40 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. లియామ్ లివింగ్ స్టన్ (0) డకౌట్ అయ్యాడు. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 2, విఘ్నేశ్ పుతూర్ 1 వికెట్ తీశారు.
దాదాపు 93 రోజుల తర్వాత క్రికెట్లోకి పునరాగమనం చేసిన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. బుమ్రా 4 ఓవర్లు బౌల్ చేసి 29 పరుగులు ఇచ్చాడు. బుమ్రా బౌలింగ్ కు దిగగా కోహ్లీ ఓ సిక్సర్ తో అతడికి స్వాగతం పలకడం మ్యాచ్ లో హైలైట్ గా నిలిచింది.