Shashi Tharoor: ట్రంప్ సుంకాలు విధించినప్పటి నుంచి ప్రపంచం ఇబ్బంది పడుతోంది: శశిథరూర్

- అమెరికాతో ద్వైపాక్షిక చర్చల ద్వారా భారత్‌కు ఉపశమనం లభిస్తుందని ఆశాభావం
- ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌లు అన్ని దేశాలకూ ప్రతికూల వార్తే అన్న శశిథరూర్
- టారిఫ్‌తో ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఆందోళన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ సహా వివిధ దేశాలపై సుంకాలు విధించినప్పటి నుంచి ప్రపంచం చాలా ఇబ్బంది పడుతోందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. రేపు, ఎల్లుండి అహ్మదాబాద్‌లో ఏఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. ఇందుకోసం అహ్మదాబాద్ విచ్చేసిన శశిథరూర్ మీడియాతో మాట్లాడుతూ, అమెరికాతో ద్వైపాక్షిక చర్చల ద్వారా భారత్‌కు ఉపశమనం లభిస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.
రెండు రోజుల పాటు జరిగే పార్టీ కీలక సమావేశాల్లో దేశంలోని తాజా పరిస్థితులు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు చెప్పారు. ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌లు అన్ని దేశాలకూ ప్రతికూల వార్తే అన్నారు. ఈ టారిఫ్ అంశం ఎవరికీ అర్థం కావడం లేదని, వీటిని భరించాలని అన్నారు. దీంతో ఇంత చెడు జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరని, ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఆందోళన వ్యక్తం చేశారు.