Yasin Bhatkal: దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో రేపు తెలంగాణ హైకోర్టు తీర్పు

Telangana High Court to Deliver Verdict in Dilsukhnagar Bomb Blast Case Tomorrow
  • 2013లో వరుస పేలుళ్ళలో 18 మంది మృతి
  • నిందితులకు ఉరిశిక్ష విధించిన ఎన్ఐఏ కోర్టు
  • తీర్పుపై హైకోర్టును ఆశ్రయించిన ముద్దాయిలు
పన్నెండేళ్ల క్రితం దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో రేపు తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన వరుస పేలుళ్లలో 18 మంది మృతి చెందగా, 130 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి 2016లో ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించింది.

దీనిపై ముద్దాయిలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం (ఏప్రిల్ 8) తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో నిందితుడు భత్కల్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు.
Yasin Bhatkal
Dilsukhnagar Bomb Blasts
Telangana High Court
NIA Fast Track Court
2013 Dilsukhnagar Bombings
Terrorism in India
Indian Judiciary
Death Sentence
Hyderabad Bombings

More Telugu News