ఏఐ సాయంతో నకిలీ వీడియోలు సృష్టించారు: హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్
- కంచ గచ్చిబౌలి భూముల వివాదం
- జింకలు, నెమళ్లు పారిపోతున్నట్లు నకిలీ వీడియోలు సృష్టించారన్న ప్రభుత్వం
- ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన మేనక గురుస్వామి
భూమిని చదును చేసే క్రమంలో బుల్డోజర్లను చూసి జింకలు, నెమళ్లు పారిపోతున్నట్లు నకిలీ వీడియోలను సృష్టించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. నకిలీ వీడియోలు సృష్టించిన వారిపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. ఈ పిటిషన్‌పై ఏప్రిల్ 24న వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.